లాస్య-మంజునాథ్ ని అయోధ్యకు పంపిన ఆదివారం విత్ స్టార్ మా పరివారం
on Apr 7, 2025
ఆదివారం విత్ స్టార్ మా పరివారం షోలో ఎప్పుడూ చేయని ఒక ప్రయోగం చేశారు. అదేంటంటే శ్రీరామనవమి సందర్భాన్ని పురస్కరించుకుని ఇష్మార్ట్ జోడీస్ ని ఈ షోకి తీసుకొచ్చారు. తీసుకురావడమే కాకుండా వీళ్లకు కొన్ని టాస్కులు కూడా ఇచ్చారు. ఆ తసుకుల్లో గెలిచిన జంటతో శ్రీరామనవమి పూజా కార్యక్రమం చేయించారు. అలాగే ఇంకో స్పెషల్ సర్ప్రైజ్ గా గెలిచిన జంటను అయోధ్యకి కూడా పంపిస్తామని చెప్పి హామీ ఇచ్చారు. ఇచ్చినట్టే ఒక జంటను కూడా పంపించారు. ఆ పోటీలు ఏంటంటే నేల మీద ఒక పట్టా వేసి భార్య భర్తను నిలబెట్టి డాన్స్ చేయించడం, తర్వాత భోజనం... ఎవరు అన్నీ ఖాళీ చేస్తారో అని కాన్సెప్ట్, తర్వాత గురి చూసి బాణం వేసే టాస్క్ ఇలా రక రకాల టాస్కులు ఇచ్చింది. ఐతే ఫైనల్ గా ఇదంతా కాదు అని ఆ జోడీలు పేర్లు కాగితాల మీద రాసి మడతేసి టేబుల్ మీద పొసే సీనియర్ నటుడు ప్రదీప్ - సరస్వతి చేత తీయించింది. ఎవరి పేర్లు వస్తాయో వాళ్ళు అవుట్ అంటూ కొత్త పేర్లు చెప్పింది. ఇక ఫైనల్ గా రాకేష్ - సుజాత, లాస్య - మంజునాథ్ మాత్రమే ఉన్నారు. ఇందులో ఫైనల్ లాస్య - మంజునాథ్ పేర్లు రాలేదు. దాంతో వాళ్ళు గెలిచినట్టు అనౌన్స్ చేసింది శ్రీముఖి. వాళ్ళు అయోధ్య వెళ్తారంటూ చెప్పేసరికి లాస్య కన్నీళ్లు పెట్టేసుకుంది. తర్వాత శ్రీముఖి ఇలా చెప్పింది "అసలు ఇష్మార్ట్ జోడికి నేను ఎందుకు వచ్చా మళ్ళీ వైల్డ్ కార్డు ఎంట్రీగా ఎందుకు వచ్చా..నేను ఎప్పుడొచ్చినా లక్ ఎందుకు రాదు..లక్ నా దగ్గర ఎందుకు లేదు. లక్ అదీ ఇది అవసరం లేదు... శ్రీరాముడి అనుగ్రహం మీ మీద ఉంది" అని చెప్పింది శ్రీముఖి. "ఇష్మార్ట్ జోడిలో అన్ని పోటీల్లో ఓడిపోయాను. బయట ఎవరేం మాట్లాడుకుంటారో తెలీదు కానీ మా జున్ను మాత్రం ఇంత చిన్న పోటీ కూడా గెలవలేకపోయావా" అని అడిగాడు అంటూ లాస్య ఏడ్చేసింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



